![]() |
![]() |
.webp)
హిందీనాట విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచింది యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ. అలాంటి ఈ బేనర్ నిర్మించిన సక్సెస్ ఫుల్ వెంచర్స్ లో `ఇష్క్ జాదే` ఒకటి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రీవియస్ మూవీ `లేడీస్ వర్సెస్ రికీ భల్`లో ఓ ముఖ్య పాత్ర పోషించిన పరిణీతి చోప్రా.. ఈ సినిమాలో ప్రధాన నాయికగా అభినయించింది. చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా, చిత్ర దర్శకుడు హబీబ్ ఫైజల్ కథను అందించారు. విషాదాంతపు ప్రేమకథగా రూపొందిన ఈ రివెంజ్ యాక్షన్ డ్రామాలో పర్మా చౌహాన్ గా అర్జున్ కపూర్, జోయా ఖురేషిగా పరిణీతి చోప్రా ఆకట్టుకున్నారు. గౌహర్ ఖాన్, రతన్ సింగ్ రాథోర్, అనిల్ రస్తోగి, నటాషా రస్తో గి, శశాంక్ ఖైతాన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి రంజిత్ బరోత్ నేపథ్య సంగీతమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``పరేషాన్``, ``జల్లా వల్లా``, ``చోక్రా జవాన్`` వంటి గీతాలు రంజింపజేశాయి. కాగా, 2012 మే 11న విడుదలై విజయం సాధించిన `ఇష్క్ జాదే`.. నేటితో 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |