![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ కెప్టెన్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరు జట్టుకడితే.. హిట్టుకొట్టడం ఖాయం అన్నది ఇప్పటికే రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద నిరూపితమైంది. `సింహా`, `లెజెండ్` తరువాత `అఖండ`తో ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ సెన్సేషన్ కి సిద్ధమవుతున్నారు బాలయ్య, బోయపాటి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మూవీస్ తోనే కొంతమంది నాయికలు టాలీవుడ్ లో తొలి హిట్స్ సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఎన్ని చిత్రాల్లో నటించినా రాని సక్సెస్, గుర్తింపు.. వీరిద్దరి కాంబో వెంచర్స్ తోనే దక్కడం విశేషం.
ముందుగా `సింహా` విషయానికొస్తే.. ఇందులో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్. ఈ ముగ్గురిలోనూ నమితనే టాలీవుడ్ లో సీనియర్. కానీ `సింహా` కంటే ముందే నయన్, స్నేహ హిట్స్ చూశారు. అయితే, నమిత మాత్రం `సొంతం`, `జెమిని`, `ఒక రాజు ఒక రాణి`, `ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి`, `నాయకుడు`, `బిల్లా` చిత్రాల్లో నటించినా.. సాలిడ్ హిట్ కొట్టింది మాత్రం `సింహా`తోనే.
ఇక `లెజెండ్` సంగతి తీసుకుంటే.. రాధికా ఆప్టే అప్పటికే `రక్త చరిత్ర` సిరీస్ లోనూ, `ధోని` అనే చిత్రంలోనూ నటించినప్పటికీ టాలీవుడ్ లో తొలి సాలిడ్ హిట్ మాత్రం `లెజెండ్`తోనే దక్కింది. అలాగే మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా అప్పటికే `రెయిన్ బో` అనే సినిమాలో నటించినప్పటికీ.. `లెజెండ్`తోనే తెలుగునాట ఫస్ట్ సక్సెస్ చూసింది.
ఈ నేపథ్యంలోనే.. `అఖండ`లో నాయికగా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ కూడా నమిత, రాధికా ఆప్టే, సోనాల్ మాదిరిగా బాలయ్య - బోయపాటి కాంబినేషన్ మూవీతోనే టాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ చూసే స్కోప్ ఉందన్నది పరిశీలకుల మాట. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ `డేగ`, `మిర్చిలాంటి కుర్రాడు`, `కంచె`, `ఓం నమో వేంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా మెప్పించలేకపోయింది. సో.. `అఖండ` టైటిల్ కి తగ్గట్టే అఖండ విజయం సాధిస్తే గనుక.. బాలయ్య - బోయపాటి ద్వయం అంటే సక్సెస్ లేని హీరోయిన్స్ కి ఆ లోటు తీర్చే కాంబోగానూ ప్రత్యేక గుర్తింపు పొందినట్లే.
త్వరలోనే `అఖండ` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |