![]() |
![]() |

టాలీవుడ్ డెబ్యూ మూవీ `ఆర్ ఎక్స్ 100`లో నెగటివ్ టచ్ ఉన్న హీరోయిన్ రోల్ లో దర్శనమిచ్చింది ఢిల్లీ డాళ్ పాయల్ రాజ్ పుత్. ఊహాతీతంగా సాగే ఇందు పాత్రలో తన అభినయంతో మెస్మరైజ్ చేసింది. ఆ తరువాత పాజిటివ్ క్యారెక్టర్స్ వైపే మొగ్గు చూపిస్తూ వచ్చిన పాయల్.. గత ఏడాది చివరలో `ఆహా` ఓటీటీలో విడుదలైన `అనగనగా ఓ అతిథి`లోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. అయితే, `ఆర్ ఎక్స్ 100`లా `అనగనగా ఓ అతిథి` ఆకట్టుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. కొత్తగా తను చేయబోతున్న వెబ్ సిరీస్ లోనూ అదే తరహా ప్రయత్నం చేయబోతోందట పాయల్. ఆ వివరాల్లోకి వెళితే.. `ఆహా` ఓటీటీ నుంచి త్వరలో `త్రీ రోజెస్` పేరుతో ఓ వెబ్ సిరీస్ రానుందని సమాచారం. అందులో అభినయానికి ఆస్కారమున్న పాత్రని ధరిస్తోందట పాయల్. ఇంకా చెప్పాలంటే.. విలన్ తరహా క్యారెక్టర్ లో మిస్ రాజ్ పుత్ యాక్ట్ చేస్తోందట. మరి.. డెబ్యూ సిరీస్ లో పాయల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఆమెకి నటిగా ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం పాయల్ చేతిలో `5Ws` అనే తెలుగు చిత్రంతో పాటు `ఏంజెల్` అనే తమిళ సినిమా ఉంది.
![]() |
![]() |