![]() |
![]() |

ఉత్తరాది సొగసరి రాశీ ఖన్నా చేతిలో ప్రస్తుతం అరడజనుకి పైగా చిత్రాలున్నాయి. అయితే, వాటిలో రెండు మాత్రమే తెలుగు సినిమాలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆ రెండు సినిమాల్లోనూ ఆయా కథానాయకులతో ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తోంది రాశి. ఆ చిత్రాలే.. `పక్కా కమర్షియల్`, `థాంక్ యూ`.
ముందుగా `పక్కా కమర్షియల్` విషయానికొస్తే.. ఇందులో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు. ఇదివరకు గోపీచంద్ తో కలిసి `జిల్`, `ఆక్సిజన్` సినిమాల్లో నటించింది రాశి. వీటిలో `జిల్` ఫర్లేదనిపిస్తే.. `ఆక్సిజన్` మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది.
ఇక `థాంక్ యూ` సంగతి తీసుకుంటే.. ఇందులో యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడు. ఇంతకుముందు చైతూతో కలిసి `మనం`, `వెంకిమామ` చిత్రాల్లో సందడి చేసింది మిస్ ఖన్నా. `మనం`లో తనది చైతూ లవ్ ఇంట్రస్ట్ గా గెస్ట్ రోల్ కాగా.. `వెంకిమామ`లో ఫుల్ లెన్త్ హీరోయిన్ వేషం.
మొత్తమ్మీద.. రెండు విజయాల తరువాత చైతూతో.. రెండు అపజయాల తరువాత గోపీచంద్ తో రాశి నటిస్తోందన్నమాట. మరి.. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
![]() |
![]() |