![]() |
![]() |

లెజండరీ యాక్టర్ రావు గోపాలరావ్ తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ.. అనతికాలంలోనే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రావు రమేశ్. కొన్ని చిత్రాల్లో అయితే తనే హైలైట్ గా నిలిచిన సందర్భాలున్నాయి. అలాంటి రావు రమేశ్ కి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన సినిమాల్లో `ఆర్ ఎక్స్ 100` ఒకటి.
ఇందులో కథానాయిక తండ్రి పాత్రలో చక్కగా నటించారు రావు రమేశ్. మరీ ముఖ్యంగా.. పతాక సన్నివేశాల్లో తనశైలి అభినయంతో, డైలాగ్స్ తో సినిమాకి ప్రాణం పోశారు. కట్ చేస్తే.. ఇప్పుడదే చిత్ర దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న `మహా సముద్రం`లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ విలక్షణ నటుడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులో గూనివాడి పాత్రలో దర్శనమివ్వనున్నారట రావు రమేశ్. అంతేకాదు.. తన కెరీర్ లో ఇది మరో ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. మరి.. ఈ సినిమా రావు రమేశ్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
`మహా సముద్రం`లో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 19న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |