![]() |
![]() |

`పుష్ప`.. `అల వైకుంఠపురములో` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - `రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ నుంచి వస్తున్న సినిమా ఇది. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో డి-గ్లామర్డ్ లుక్ తో దర్శనమివ్వనున్నారు బన్నీ. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించబోతున్నాడు. బన్నీకి చెల్లెలుగా ఐశ్వర్యా రాజేశ్ నటించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. 2010లో వచ్చిన లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తమిళ అనువాద చిత్రం `విలన్` ఛాయలతో `పుష్ప` రూపొందుతోందని బజ్. చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పే ఓ అన్న కథతో `విలన్` తెరకెక్కితే.. `పుష్ప` కూడా ఇంచుమించుగా అదే స్టోరీ లైన్ తో తయారవుతోందని వినికిడి. `విలన్` తరహాలోనే `పుష్ప` కూడా అటవీ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో.. ఈ కథనాలకు మరింత బలం చేకూరుతోంది. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే `పుష్ప` విడుదల తేది వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ఆగస్టు 13న విడుదల కావాల్సిన `పుష్ప`.. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా వాయిదా పడనుందని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
![]() |
![]() |