![]() |
![]() |

శర్వానంద్ హీరోగా నటించిన 'శ్రీకారం' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. సినిమా బాగుందని విమర్శకులంతా ప్రశంసించినప్పటికీ, జనరల్ ఆడియెన్స్ ఆశించిన స్థాయిలో ఆ చిత్రాన్ని ఆదరించలేదు. నూతన దర్శకుడు కిశోర్ రూపొందించగా, ప్రియాంక అరుళ్‌మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో రిలీజైంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పటిదాకా ఆ యాప్‌లో రిలీజైన తెలుగు సినిమాలన్నింటి కంటే అతి తక్కువ టైమ్‌లోనే అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన మూవీగా నిలిచి, మునుపటి సినిమాల వ్యూయర్‌షిప్ రికార్డులను బ్రేక్ చేసింది.
సన్ నెక్ట్స్‌లో ఈ సినిమాని చూసిన వాళ్లలో పలువురు సోషల్ మీడియాలో థియేటర్లలో ఈ సినిమా చూడ్డం ఎందుకు మిస్ చేసుకున్నామా అనిపిస్తోందని ప్రశంసిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో తాము చూసిన ఎక్సలెంట్ మూవీ ఇదేననీ, శర్వానంద్ పర్ఫార్మెన్స్, కిశోర్ డైరెక్షన్ సూపర్బ్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. వండర్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడకపోవడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.
'శ్రీకారం'లో రైతు కావడం కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న యువకుడిగా శర్వానంద్ నటించాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లు, లాయర్ కొడుకు లాయర్ అయినట్లు.. రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదనే టిపికల్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ కిశోర్ ఈ మూవీని రూపొందించాడు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్‌కు అన్ని వైపుల నుంచీ ప్రశంసలు లభించాయి. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ మరో హైలైట్ అయిన ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు.
వరుసబెట్టి తన సినిమాలు ఫ్లాపవుతూ వస్తుంటే నిరాశలో ఉన్న శర్వానంద్‌కు ఓటీటీలో అయినా తన సినిమా హిట్టయినందుకు కొంత ఊరట లభించినట్లే.
![]() |
![]() |