![]() |
![]() |

సినిమా షూటింగ్స్ లో అయిన గాయాలు తిరగబెట్టి పలువురు టాలీవుడ్ స్టార్స్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే కుడి భుజానికి బాలకృష్ణ, మోకాలికి మహేష్ బాబు సర్జరీ చేయించుకోగా ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. రీసెంట్ గా ఆయన మోకాలికి సర్జరీ జరగడంతో 'సలార్' సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
మార్చి 11 న 'రాధేశ్యామ్'తో ప్రేక్షకులను పలకరించి నిరాశపరిచిన ప్రభాస్ ఆ విదేశాలకు వెళ్ళాడు. దీంతో ఆయన వెకేషన్ కి వెళ్లారని భావించారంతా. కానీ ఆయన సర్జరీ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం షూటింగ్ లో జరిగిన గాయం తిరగబెట్టడంతో.. యూరప్ కి చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రభాస్ మోకాలికి సర్జరీ చేసినట్లు సమాచారం. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలలు పడుతుందని, అప్పటివరకు ప్రభాస్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు. దీని కారణంగా సలార్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
ప్రభాస్ ఇప్పటికే 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా జనవరి 12, 2023 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సలార్', 'ప్రాజెక్ట్ k' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే మారుతి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సాహో', 'రాధేశ్యామ్' ఫలితాలను చూసైనా ప్రభాస్ సినిమాల ఎంపిక జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |