![]() |
![]() |

విజయ్ దేవరకొండ హీరోగా 'జేజీఎమ్' అనే మూవీని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనౌన్స్ చేశాడు. ఈ మూవీని వంశీ పైడిపల్లికి చెందిన శ్రీకర స్టూడియోస్, పూరి-చార్మి సొంత ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'జేజీఎమ్' అంటే 'జనగణమన'. నిజానికి ఈ మూవీని 'బిజినెస్‌మేన్' తర్వాత మహేశ్‌తో తియ్యాలని అనుకున్నాడు జగన్. కానీ మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇంతదాకా ఈ సినిమా వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం తనతో 'లైగర్' మూవీ చేస్తోన్న విజయ్‌కు ఈ కథ వినిపించాడు జగన్. వెంటనే అతను చేస్తానని చెప్పేశాడు. అలా జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చబోతోంది.
"ఇది నిజంగా నా డ్రీమ్ ఫిల్మ్. చాలా కాలం నుంచీ ఈ సినిమా తియ్యాలనుకుంటూ వెయిట్ చేస్తున్నాను. ఎట్టకేలకు విజయ్ కారణంగా సాధ్యమవుతోంది. ఇది ఫిక్షనల్ స్టోరీ. పేట్రియాటిక్ అండ్ వార్ కైండ్ ఆఫ్ మూవీ. హీరో ఒక ఆర్మీ ఆఫీసర్. తన దేశం గురించీ, తన పౌరుల గురించీ ఒక సోల్జర్ కనే కల. ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ అని చెప్పగలను. హీరో 'జేజీఎమ్' అనే మిషన్ ప్రారంభిస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాను." అంటూ చెప్పుకొచ్చాడు జగన్. ఈ వీడియోను చార్మి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
వచ్చే ఏడాది ఆగస్ట్ 3న 'జేజీఎమ్'ను విడుదల చేస్తామని కూడా జగన్ అండ్ కో ప్రకటించింది. కాగా జగన్-విజయ్ కాంబో ఫస్ట్ ఫిల్మ్ 'లైగర్' ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదలవుతోంది.
![]() |
![]() |