![]() |
![]() |

తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో `లవ్ లీ` ఒకటి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో ఆది సాయికుమార్, శాన్వి జంటగా దర్శనమిచ్చారు. దివంగత దర్శకురాలు బి. జయ రూపొందించిన ఈ సినిమాలో రాహుల్ దేవ్, వెన్నెల కిశోర్, పరుచూరి గోపాల కృష్ణ, ఆహుతి ప్రసాద్, హర్షవర్ధన్, సత్య కృష్ణన్, తనికెళ్ళ భరణి, వై. కాశీ విశ్వనాథ్, ఆంచల్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
అనూప్ రూబెన్స్ సంగీతమందించిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కందికొండ, సిరాశ్రీ, అనూప్ రూబెన్స్ సాహిత్యమందించారు. ``లవ్ లీ లవ్ లీ``, ``ఏవో ఏవేవో``, ``నిన్ను చూసిన``, ``ఐ డోన్ట్ నో``, ``చోరి చోరియే``, ``డోలారే డోలారే``, ``నేనున్నది``.. ఇలా ఇందులోని గీతాలన్ని యువతరాన్ని ఆకట్టుకున్నాయి. ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమాస్ పతాకాలపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ.రాజు సంయుక్తంగా నిర్మించిన `లవ్ లీ`.. 34 కేంద్రాలలో 50 రోజులు, 12 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అలాగే, ఒడియాలో `సెల్ఫిష్ దిల్` (2019) పేరుతో రీమేక్ అయింది. 2012 మార్చి 30న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `లవ్ లీ`.. నేటితో 10 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |