![]() |
![]() |

`అఖండ` ఘనవిజయం నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో.. బాలయ్య తదుపరి చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎన్బీకే 107` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలయ్య ఎప్పటిలాగే ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే, గత ఏడాది ఉగాది పర్వదినాన `అఖండ టైటిల్ రోర్` రూపంలో గూస్ బంప్స్ ఇచ్చిన బాలకృష్ణ.. ఈ సంవత్సరం కూడా అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న `ఎన్బీకే 107` టీమ్ ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందట. ఆ రోజు టైటిల్ తో పాటు పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ అందించే దిశగా గోపీచంద్ అండ్ కో సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
కాగా, `ఎన్బీకే 107`లో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ యాక్షన్ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
![]() |
![]() |