![]() |
![]() |

ప్రస్తుతం బాలీవుడ్ లో హవా సాగిస్తున్న అందాల తార కృతి సనన్.. తెలుగు చిత్రం `1 నేనొక్కడినే`తోనే హీరోయిన్ గా తొలి అడుగేసిన సంగతి తెలిసిందే. హిందీ సినిమాలతో బిజీగా మారాక దక్షిణాది వైపు శీతకన్నేసిన ఈ అమ్మడు.. త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటించిన పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆదిపురుష్`తో ఇక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మైథలాజికల్ మూవీ 2023 సంక్రాంతికి సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే, తాజాగా కృతి సనన్ ఓ బైలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి ఓ సినిమాని రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం కృతి సనన్ ని నాయికగా ఎంపిక చేశారని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాకిగానూ కృతి భారీ పారితోషికమే అందుకోబోతున్నట్లు బజ్. త్వరలోనే విజయ్ - వంశీ పైడిపల్లి కాంబో మూవీలో కృతి సనన్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |