![]() |
![]() |

ఇండియన్ స్టార్స్ లో బెస్ట్ డాన్సర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ముందు వరుసలో ఉంటారు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో సందేహం లేదు. 'వార్-2' రూపంలో ఆ అద్భుతం చోటు చేసుకోనుంది. (War 2)
యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందే స్పై యూనివర్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా ప్రస్తుతం 'వార్-2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇంతవరకు అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా విడుదల కాకుండానే, ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 'వార్-2'కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్.. ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.
'వార్-2' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈరోజు(మార్చి 4) నుంచి యశ్ రాజ్ స్టూడియోస్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్యాన్స్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తోంది. ఆ ఎనర్జిటిక్ మ్యూజిక్ కి తగ్గట్టుగానే.. బోస్కో మార్టిన్ అదిరిపోయే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేస్తున్నారట. దాదాపు వారం రోజుల పాటు, 500 మందికి పైగా డ్యాన్సర్లతో భారీస్థాయిలో ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 'వార్-2' సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్ లో ఒకటిగా.. హృతిక్-ఎన్టీఆర్ కాంబో సాంగ్ నిలవనుందని అంటున్నారు.
కాగా, 'వార్-2' చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూస్తుంటే.. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. ఇక పాజిటివ్ టాక్ వస్తే, ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |