![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ జనవరిలో అధికారకంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ssmb 29(ssmb 29)అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుండగా మహేష్ ని మినహాయించి మిగతా నటీనటుల విషయంలో ఎలాంటి న్యూస్ లేదు.ప్రియాంక చోప్రా మాత్రం హీరోయిన్ గా చేస్తుంది.ఈ విషయాన్నీ మేకర్స్ ఇంకా వెల్లడి చెయ్యకపోయినా కూడా,ప్రియాంకచోప్రా(Priyanka chopra)హైదరాబాద్ వచ్చి ssmb 29 టీం ని కలవడం,సోషల్ మీడియా వేదికగా .ssmb 29 లో భాగస్వామ్యం కాబోతున్నానని ప్రియాంక చెప్పడం జరిగింది.
రీసెంట్ గా మలయాళ సూపర్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)ఇనిస్టాగ్రమ్(Inistagram)వేదికగా ఒక పోస్ట్ చేసాడు.'దర్శకుడి'గా నా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశాను.వాటికి సంబంధించిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.ఇక నటుడుగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాను.ఇందుకు సంబంధించి ఒక పరభాషా చిత్రంలో నటించనున్నాను.ఆ మూవీలో పెద్ద పెద్ద డైలాగులు ఉండబోతున్నాయి. కొంచం భయంగా కూడా ఉందంటూ పోస్ట్ చేసాడు.పృథ్వీ రాజ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు, ssmb 29 ని ఉద్దెశించే,ఈ పోస్ట్ చేసాడని పలువురు సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి పృథ్వీ రాజ్ ssmb 29 లో చెయ్యబోతున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి.సలార్ లో ప్రభాస్ తో కలిసి పృథ్వీ రాజ్ ఒక రేంజ్ లో నటించిన విషయం తెలిసిందే.
ssmb 29 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.త్వరలోనే యూనిట్ ఫారెన్ కూడా వెళ్లబోతుందని, అక్కడే లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు.అంతకంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించిన వివరాలని ఫస్ట్ టైం మీడియాతో పంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.అమెజాన్(Amazon)అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని, దుర్గ ఆర్ట్స్(Durga arts)పతాకంపై కెఎల్ నారాయణ(Kl Narayana)నిర్మిస్తుండగా కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |