![]() |
![]() |

`యువత`, `ఆంజనేయులు`, `సోలో`, `సారొచ్చారు`, `శ్రీరస్తు శుభమస్తు`, `గీత గోవిందం`.. ఇలా పరిమిత సంఖ్యలోనే సినిమాలు తీసినా, తెలుగునాట దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు పరశురామ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కెప్టెన్ `సర్కారు వారి పాట` చిత్రంతో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వేసవి కానుకగా మే 12న జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా సమ్మర్ సీజన్ లో రిలీజ్ కాలేదు. `సర్కారు వారి పాట`తోనే తొలిసారిగా వేసవిలో ఎంటర్టైన్ చేయనున్నాడు పరశురామ్. మరి.. ఫస్ట్ టైమ్ సమ్మర్ టైమ్ లో వస్తున్న ఈ సినిమాతో.. పరశురామ్ మెమరబుల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, పరశురామ్ గురువు పూరీ జగన్నాథ్ కూడా మహేశ్ తో తీసిన ఫస్ట్ ఫిల్మ్ `పోకిరి`ని సమ్మర్ సీజన్ కే టార్గెట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సెంటిమెంట్ కూడా పరశురామ్ కి వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరమే.
ఇదిలా ఉంటే, `సర్కారు వారి పాట`లో మహేశ్ బాబుకి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |