![]() |
![]() |

తన తోటి నటీనటులకు, సన్నిహితులకు స్వీట్ గిఫ్ట్స్ పంపి సర్ ప్రైజ్ చేయడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలవాటు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుకి దీపావళి గిఫ్ట్స్ పంపి సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్ట్స్ పంపారని నమ్రత ఇన్స్టాగ్రామ్ లో స్టొరీ పెట్టారు. గిఫ్ట్ బాక్స్ ఫోటోని షేర్ చేసిన నమ్రతా "థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ" అంటూ విషెస్ తెలిపారు. పవన్ దంపతులు పంపిన గిఫ్ట్ బాక్స్ లో స్వీట్స్ తో పాటు, పర్యావరణహిత పటాసులు ఉన్నాయి. నమ్రత ఇన్ స్టాలో పంచుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపావళి సాక్షిగా పవన్, మహేష్ ల ఫ్రెండ్ షిప్ మరోసారి బయటపడింది అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే పవన్ 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్', సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. మహేష్ విషయానికొస్తే ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
![]() |
![]() |