![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తన సినిమాలలో భారీతనం ఉండేలా చూసుకునే శంకర్ ఈ సినిమాలో ఓ భారీ ట్రైన్ ఫైట్ సీన్ ని ప్లాన్ చేశారని ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ సినిమాటోగ్రఫర్ తిరు ఒక హింట్ ఇచ్చారు.
డైరెక్టర్ శంకర్ అంటేనే భారీతనం. ఆయన ఏ సినిమా తీసినా భారీతనం కనిపిస్తుంటుంది. ఆయన సాంగ్స్, ఫైట్స్ కోసం బాగా ఖర్చు పెట్టిస్తుంటారని తెలిసిందే. ఇప్పుడు చరణ్ తో చేసే సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఆ భారీతనం రెట్టింపు అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో సాంగ్స్, ఫైట్స్ కోసం భారీగా చేయనున్నారని అంటున్నారు. ముఖ్యంగా ట్రైన్ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని టాక్. తాజాగా సినిమాటోగ్రఫర్ తిరు కూడా ఒక ఫోటో ద్వారా ట్రైన్ ఫైట్ గురించి పరోక్షంగా చెప్పేశారు.

తాజాగా తిరు ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో రైల్వే ట్రాక్ మధ్యలో శంకర్ చైర్ లో కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో కొండలు, ఆ కొండలు పక్కనుంచి వెళ్తున్న రైల్వే ట్రాక్ తో ఆ ఫోటో ఆకట్టుకుంటోంది. అంతేకాదు "చక్రాలు కదిలాయి.. మేం ట్రాక్ లో ఉన్నాం" అంటూ తిరు ట్వీట్ కూడా చేశారు. తిరు షేర్ చేసిన ఫోటోను చూసిన నెటిజన్లు 'సినిమాలో ట్రైన్ ఫైట్ ఖచ్చితంగా ఉన్నట్లే' అని కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ ఫ్యాన్స్ కొందరైతే 'వినయ విధేయ రామ'లోని ట్రైన్ సీక్వెన్స్ ని గుర్తుతెచ్చుకొని ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |