![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్‌ను పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్, తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. దాని కోసం తన బాడీని తీర్చిదిద్దుకోవడానికి తన ఇంట్లోని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన కుడిచేతి వేలు విరిగినట్లు ఆలస్యంగా తెలియవచ్చింది. గత వారమే ఆయన వేలుకు ఫ్రాక్చర్ అవగా, డాక్టర్లు ఆయనకు మైనర్ ఆపరేషన్ చేసి, చేతికి కట్టుకట్టారు.
దీపావళి పర్వదినం సందర్భంగా తారక్ అభిమానులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసున్న ఓ పిక్చర్‌ను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో తారక్ కుడిచేతి వేళ్లకు బ్యాండేజ్ వేసి ఉండటం కనిపించింది.
డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నిజానికి డిసెంబర్‌లో కొరటాల శివ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. వేలి ఫ్రాక్చర్ కారణంగా క్యారెక్టర్ ప్రిపరేషన్‌కు కొంత గ్యాప్ ఇవ్వక తప్పని స్థితి. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2022 జనవరికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈలోగా 'ఆర్ఆర్ఆర్' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో తారక్ పాల్గొననున్నాడు. ఈ సినిమాలో ఆయన కొమురం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. 2022 జనవరి 7న ఆ మూవీ రిలీజ్ అవుతోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'పై అంచనాలు ఏ రీతిలో ఉన్నాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
'బాహుబలి' సిరీస్‌ను మించి ఈ మూవీ స్పెక్టాక్యులర్ విజువల్ వండర్‌గా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన 45 సెకన్ల గ్లిమ్స్‌తో 'ఆర్ఆర్ఆర్'పై వెల్లువెత్తుతున్న హైప్ మామూలుగా లేదు. దేశంలోని సినీ గోయర్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అంతా ఈ మూవీ కోసం అత్యంత క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.
![]() |
![]() |