![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. ఈ మూవీలో సిద్ధ అనే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే సందడి చేయనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే' సాంగ్ ఆకట్టుకోగా.. తాజాగా 'నీలాంబరి' సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'ఆచార్య' సినిమా నుంచి 'నీలాంబరి' అంటూ సాగే రెండో సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. మణిశర్మ మార్క్ మెలోడీ సాంగ్ అయిన ఈ 'నీలాంబరి' స్లో పాయిజన్ లా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మణిశర్మ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం వినసొంపుగా ఉన్నాయి. తన వాయిస్ తో అనురాగ్ కులకర్ణి మరోసారి మ్యాజిక్ చేశాడు. ఇక లిరికల్ వీడియోలో చరణ్, పూజల లుక్స్.. వారి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్స్.. సాంగ్ కి తగ్గట్లుగా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మొత్తానికి 'నీలాంబరి' సాంగ్ కూడా 'లాహే లాహే' సాంగ్ లా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ఆచార్య సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022, ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.
![]() |
![]() |