![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'మెగా ఫ్యామిలీ హీరో' అనే ముద్ర తన మీద పడకుండా తనకంటూ ప్రత్యేకంగా అల్లు బ్రాండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్లే కొంతకాలంగా ఆయన బిహేవియర్ కూడా మారినట్లు కనిపించింది. ఆయన తాతగారు అల్లు రామలింగయ్యని పదేపదే గుర్తు చేసుకోవడం, ఈవెంట్స్ లో అల్లు అర్జున్ ఆర్మీ అనడం వంటి చర్యలు బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అనుకునేలా చేశాయి. కొందరు ఫ్యాన్స్ సైతం మెగా, అల్లుగా విడిపోయి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే తాను మెగా ఫ్యామిలీకి దూరంగా జరుగుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని తాజాగా బన్నీ రుజువు చేశాడు.
మెగా-అల్లు ఫ్యామిలీ కలిసి దీపావళి జరుపుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ నివాసంలో మెగా, అల్లు ఫ్యామిలీలలోని యంగర్ జనరేషన్ అంతా కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్ ను సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలలో బన్నీ, చరణ్, స్నేహారెడ్డి, ఉపాసన, నిహారిక, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీ, శ్రీజ తదితరులు కనిపిస్తున్నారు.
'హ్యాపీ దీపావళి' అంటూ బన్నీ, చరణ్ లు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసి మెగా-అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీకి బన్నీ దూరం కాలేదని, కేవలం తన ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చూస్తున్నాడని, అందులో తప్పేముందని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఒక్క ఫోటోతో తాను మెగా ఫ్యామిలీకి దూరం కాదని బన్నీ చెప్పేశాడు అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా విడుదలకానుంది. మొదట భాగం 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |