![]() |
![]() |

హీరో డాక్టర్ రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ తమిళనాడు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి, చెన్నై డీసీపీగా రిటైర్ అయ్యారు.
ఆయనకు అయిదుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయనకు హీరో రాజశేఖర్ రెండో సంతానం. శుక్రవారం ఉదయం వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజన్ నాలుగేళ్ల క్రితం 2017 సెప్టెంబర్‌లో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోనే మృతి చెందారు.

![]() |
![]() |