![]() |
![]() |

దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. దేశంలో వున్న ప్రజాస్వామ్య వాదులతో పాటు సెలబ్రిటీలు కూడా మేము సైతం అంటూ రైతులకు అండగా నిలుస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో అంతర్జాతీయ తార, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేరింది. ఇండియాలో జరుగుతున్న రైతు ఉద్యమంపై తాజాగా స్పందించింది. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం, రైతులని యాక్టర్స్ అంటూ విమర్శలు చేస్తున్న వ్యక్తులపై ట్విట్టర్ వేదికగా మండిపడింది. ఆమె స్పందనపై పలువురు మిశ్రమంగా స్పందించారు.
"స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్" అనే ప్లకార్డులు పట్టుకున్న రైతుల ఫొటోలని షేర్ చేసిన మియా ఖలీఫా, రైతు ఉద్యమంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడుందని, ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల్ని ఎందుకు నిలిపి వేశారని #FarmersProtest హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నించింది. అంతేనా రైతుల్ని పెయిడ్ యాక్టర్స్ అంటూ విమర్శలు గుప్పిస్తున్న వ్యక్తులపై మండిపడింది. "రైతులకు నేను మద్దతిస్తున్నా" అంటూ ట్వీట్ చేసింది.
![]() |
![]() |