![]() |
![]() |

తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆదరాభిమానాలు పొందిన స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు హీరోగా నటిస్తోన్న బహుభాషా చిత్రం మానాడు తెలుగులో రీవైన్డ్ పేరుతో విడుదల కానున్నది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాచి రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మాణమవుతోంది. ఈ మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2:34 గంటలకు మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు.
చిత్ర కథానాయకుడు శింబు పుట్టినరోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న మల్టీ లింగ్యువల్ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని రవితేజ అన్నారు. హీరో శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.
సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం ఈ చిత్ర ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
తమ చిత్రం 'రివైండ్' టీజర్... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రం హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్, మలయాళం టీజర్ పృథ్విరాజ్ రిలీజ్ చేయడం విశేషం.

![]() |
![]() |