![]() |
![]() |

భారీ అందాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది అందాల నమిత. 'సొంతం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సూరత్ చిన్నది జెమినీ, బిల్లా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ఆ అంతకు ముందు స్లిమ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారిపోయింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడి స్థిరపడింది.
తాజాగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా బయటపెట్టింది. ఒకానొక సందర్భంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని అభిమానులకు వెల్లడించింది. మానసిక ఒత్తిడిపై అవగాహన కల్పించడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నానని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. తొమ్మిది పదేళ్ల క్రితం నేను బొద్దుగా వుండేదాన్ని. అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు గురయ్యాను. ఒత్తిడిలో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా నాకు తెలియకపోవడం బాధాకరం. రాత్రిళ్లు నిద్రపోయేదాన్ని కాదు. దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారింది. నాకు తెలియకుండానే విపరీతంగా బరువు పెరిగిపోయాను. అలా నా బరువు 97 కిలోలకు పెరిగిపోయింది." అని తెలిపింది నమిత.
మద్యం తాగడం వల్లే తాను బరువు పెరిగిపోయానని అందరూ చెప్పుకున్నారని ఆమె చెప్పింది. థైరాయిడ్, పీసీఓడీ సమస్యల వల్లే బరువు పెరిగానన్నది తనకు మాత్రమే తెలుసంది. "ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నన్నెంతగానో వెంటాడాయి. దాదాపు ఐదేళ్ల పాటు కుంగుబాటుకు ఎదుర్కొన్న తరువాత యోగాతో మళ్లీ నాకు మనశ్శాంతి లభించింది. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా వున్నాను." అని చెప్పుకొచ్చింది నమిత.
![]() |
![]() |