![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'చూడాలని వుంది' చిత్రంతో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఇంద్ర, ఠాగూర్, అందరివాడు చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. తను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'జాంబీ రెడ్డి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా యువ హీరో తేజ ఓ ఆసక్తికరమైన సంఘటనని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, మహేష్‌బాబు సినిమాల్లో తాను బాలనటుడిగా నటించానని, వాళ్లందరితో తనకు మంచి అనుబంధం వుందని యువ హీరో తేజ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని వుంది, ఇంద్ర, ఠాగూర్, అందరివాడు సినిమాల్లో తాను బాలనటుడిగా నటించాననన్నాడు.
"చూడాలని వుంది నా తొలి చిత్రం. ఈ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. చిత్రీకరణలో భాగంగా తలకోనలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో చిరు సర్ జ్వరంతో ఇబ్బందిపడ్డారు. చికిత్స తీసుకుని మరీ షూట్‌లో పాల్గొన్నారు. అప్పుడు నా వయసు సుమారు మూడేళ్లు. చిత్రీకరణలో భాగంగా నేను, చిరు సర్ పాల్గొనగా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి వుంది. ఆ సీన్‌లో కొలనులో నుంచి నన్ను అలా పైకి లేపాలి. నేను మాత్రం అందులో దిగనని మారాం చేశాను. దాంతో చిరు సర్ ఒక్క షాట్ కోసం రెండు గంటల పాటు నీటిలోనే వుండిపోయారు. ఆ తరువాత రోజు ఆయనకి జ్వరం మరీ ఎక్కువైంది." అని హీరో తేజ తెలిపాడు.

![]() |
![]() |