![]() |
![]() |

అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కింగ్ 'నాగార్జున'(Nagarjuna)కి ఉన్న స్టామినా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ స్టామినాని రెట్టింపు చేస్తు ఎలాంటి బేషజాలకి పోకుండా కూలీ, కుబేర చిత్రాలతో తన సత్తా చాటాడు. ప్రస్తుతం తన 100 వ చిత్రానికి సంబంధించిన కథా చర్చలో పాల్గొంటున్న, నాగార్జున నటుడిగానే కాకుండా వ్యాపార ప్రకటనల్లోను రాణిస్తున్న విషయం తెలిసిందే.
నాగార్జున రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు(Delhi HighCourt)లో ఒక పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో 'నా అనుమతి లేకుండా నా ఫోటో, పేరుని ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో మరియు వివిధ వస్తువులు, దుస్తులపై కూడా నా చిత్రాన్ని అనధికారికంగా యూజ్ చేస్తున్నారు. ఫలితంగా నా వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయనే అంశాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు, నాగార్జున వ్యక్తిత్వ హక్కులని కాపాడుతామని తెలిపింది.
ఈ తీర్పుతో సోషల్ మీడియాలో సెలబ్రటీస్ పర్మిషన్ లేకుండా వాళ్ళ పేర్లని, ఫోటోలని ఉపయోగించుకుంటున్న వాళ్ళకి ఒక చెంప పెట్టు లాంటిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐశ్వర్యారాయ్ కి కూడా వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘన కేసులో కోర్టుకి వెళ్లగా, హైకోర్టు సానుకూల తీర్పునిచ్చింది.
![]() |
![]() |