![]() |
![]() |
.jpg)
ఛోటా మోటా సినిమాలు నిర్మిస్తున్న, ఆయా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న టాలీవుడ్ ప్రముఖుల కొత్త క్రష్ ఓటిటి ఫ్లాట్‌ఫార్మ్స్. లాక్‌డౌన్‌లో ఓటిటిలకు ఆదరణ పెరిగింది. స్టార్స్ నటించిన క్రేజీ సినిమాలతో పాటు కోటి, కోటిన్నరలో తీసే చిన్న సినిమాలను సైతం ఓటిటి ఫ్లాట్‌ఫార్మ్స్ కొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో కొన్ని సీరియళ్లు, చిన్న సినిమాలు షూటింగులు ప్రారంభించాయి. అందులో విలక్షణ, విభిన్న చిత్రాలు తీసే దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కిస్తున్న 'క్రష్' ఒకటి. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఓటిటి ఫ్లాట్‌ఫార్మ్స్ కోసం సినిమాను రెడీ చేయాలని అనుకుంటున్నట్టు నిర్మాత సురేష్ బాబు తెలిపారు.
'క్రష్' కాకుండా వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప', రానా దగ్గుబాటి నిర్మిస్తున్న 'విరాటపర్వం' సినిమాల్లో సురేష్ బాబుకు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. ఛోటా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఆయన, బడా స్టార్స్ తో తీస్తున్న సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి తొందర పడటం లేదు. మరో రెండు నెలలు ఆగి ఆ సినిమాలు స్టార్ట్ చేస్తామని సురేష్ బాబు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
![]() |
![]() |