![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన తారక్.. ఆ తర్వాత పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. అయితే కొందరు అభిమానులు తారక్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ప్రస్తుతానికి తనకి సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదని చెబుతూ వస్తున్న తారక్.. తాజాగా మరోసారి తనకి రాజకీయాల గురించి ఆలోచన లేదని స్పష్టం చేశాడు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి తారక్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తారక్, చరణ్ నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు హిందీ పోర్టల్స్ తారక్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. తాజాగా ఓ హిందీ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నటుడిగా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. భవిష్యత్ అంటే ఇప్పటి నుంచి వచ్చే ఐదేళ్లు, పదేళ్లు అని అనుకునే మనిషిని కాదు. నా దృష్టిలో భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ అంతే. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నటన నాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను." అని తారక్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |