![]() |
![]() |

కింగ్ నాగార్జున, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా `బాస్` పేరుతో గతంలో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో నిరాశపరిచింది. కట్ చేస్తే.. ఇప్పుడిదే టైటిల్ తో మరో అగ్ర కథానాయకుడు సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023 పొంగల్ కి ఎంటర్టైన్ చేయనుందని సమాచారం. ఇందులో రజినీకాంత్ సరసన ఐశ్వర్యా రాయ్ నటించనుందని.. `గ్యాంగ్ లీడర్` భామ ప్రియాంక అరుళ్ మోహన్ సూపర్ స్టార్ కూతురి పాత్రలో కనిపించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తమిళంతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి యూనివర్శల్ అప్పీల్ ఉండేలా `బాస్` అనే టైటిల్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. నాగ్ కి అచ్చిరాని టైటిల్ రజినీకాంత్ కైనా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |