![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మిర్చి` (2013) ఒకటి. తొమ్మిదేళ్ళ క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామాతోనే వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ నిర్దేశకుడిగా పరిచయమయ్యాడు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా ఇదే సినిమాతో నిర్మాణ రంగంలో తొలి అడుగేసింది. కట్ చేస్తే.. త్వరలో ప్రభాస్, కొరటాల, యూవీ కాంబోలో మరో చిత్రం రాబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా ప్రభాస్ తో మరో సినిమా చేయాలని కొరటాల ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తాజాగా కొరటాల చెప్పిన ఓ పాయింట్ నచ్చడంతో డార్లింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అన్నీ కుదిరితే.. 2023 చివరలో లేదా 2024లో ప్రభాస్ - కొరటాల కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు. అలాగే, `మిర్చి`ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుందని అంటున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `ఆదిపురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్`తో పాటు మారుతి డైరెక్టోరియల్ ఉన్నాయి. మరోవైపు కొరటాల తాజా చిత్రం `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతుండగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా జూన్ నెలలో పట్టాలెక్కనుంది. సో.. ఈ కమిట్మెంట్స్ పూర్తయ్యాకే ప్రభాస్, కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్ కార్యరూపం దాల్చే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |