![]() |
![]() |
.webp)
వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తాజాగా విడుదలైన `ఆర్ ఆర్ ఆర్`తో డబుల్ హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా.. నటుడిగా మరో స్థాయికి ఎదిగారు తారక్. అలాగే, పాన్ - ఇండియా స్టార్ అనిపించుకున్నారాయన.
ఇదిలా ఉంటే, విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో తారక్ కి జంటగా `ఆర్ ఆర్ ఆర్` బ్యూటీ ఆలియా భట్ ఎంటర్టైన్ చేయనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారట ఎన్టీఆర్. అదే గనుక నిజమైతే.. `అదుర్స్`, `శక్తి`, `జై లవ కుశ` (త్రిపాత్రాభినయం) తరువాత మల్టీరోల్స్ లో తారక్ నటించే చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే కొరటాల సినిమాలో తారక్ ద్విపాత్రాభినయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `జనతా గ్యారేజ్` వంటి సంచలన చిత్రం తరువాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |