![]() |
![]() |

తెలుగునాట ఘనవిజయం సాధించిన ఛత్రపతి.. హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్, స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లో తొలి అడుగు వేస్తున్నారు. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. మదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా ఛత్రపతిలో తల్లి పాత్ర ఎంతో కీలకం. తెలుగులో ఈ పాత్రని అలనాటి అగ్ర కథానాయిక భానుప్రియ పోషించి జీవం పోశారు. మరి.. హిందీలో ఈ పాత్రని ఎవరు చేయబోతున్నారు? ఇప్పటికింకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. వినిపిస్తున్న కథనాల ప్రకారం నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్ షెఫాలి షా చేయబోతున్నారని తెలిసింది.
ఊర్మిళ ప్రధాన పాత్రలో నటించిన రంగీలా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన షెఫాలి.. సహాయక పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు. సత్య, గాంధీ - మై ఫాదర్, ద లాస్ట్ ఇయర్ చిత్రాల్లోని నటనకు పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యంగా.. ద లాస్ట్ ఇయర్ కోసం ఉత్తమ సహాయ నటిగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారామె.
ఛత్రపతి హిందీ రీమేక్ లో షెఫాలి ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
![]() |
![]() |