![]() |
![]() |

అనసూయ భరద్వాజ్.. తెలుగు టీవీ తెరను తన గ్లామర్‌తో ఏలేస్తున్న యాంకర్. ఆ గ్లామర్‌తోటే టీవీ వీక్షకులను కట్టిపడేస్తూ వస్తున్నారామె. వీక్షకుల్లో ఆమె ఇమేజ్‌ను, క్రేజ్‌ను గుర్తించిన టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే 'క్షణం', 'రంగస్థలం' లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె టాలెంట్‌ను, ఆమె గ్లామర్‌ను ఉపయోగించుకోవాలని కోలీవుడ్ సైతం కోరుకుంటూ ఉండటం విశేషం.
.jpg)
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తమిళంలో తయారవుతున్న ఓ సినిమాలో ఆమె సిల్క్ స్మిత క్యారెక్టర్‌లో కనిపించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి ఆ సినిమాలో కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అతనితో కలిసి అనసూయ షేర్ చేసిన పిక్చర్ ఆన్‌లైన్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది వాళ్లిద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా సెట్స్‌కు సంబంధించిన పిక్చర్ అంటూ ప్రచారం జరుగుతోంది.
.jpg)
కాగా, దాని తర్వాత అనసూయ షేర్ చేసిన మరో ఫొటోని బట్టి ఆమె ఆ మూవీలో సిల్క్ స్మిత పాత్రను చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఆ పిక్చర్‌లో ఆమె ఫుల్ మేకప్‌లో ఉన్నారు. అద్దంలో తనను తాను చూసుకుంటున్నట్లు ఉన్న ఆ ఫొటోలో అనసూయ దొండపండు లాంటి పెదాలు, కైపెక్కించే మత్తుకళ్లతో కనిపిస్తున్నారు. ఆ ఫొటోకు "Living through another good story. #newBeginnings #Kollywood #Tamizh" అంటూ క్యాప్షన్ పెట్టారు. అంటే తాను కోలీవుడ్‌కు పరిచయమవుతున్నానని ఆ క్యాప్షన్ ద్వారా ఆమె సూచించారన్న మాట. పైగా "రిఫరెన్స్.. సిల్మ్ స్మిత గారు" అంటూ దానికి జోడించారు.
.jpg)
దీంతో ఆమె తన కోలీవుడ్ డెబ్యూ మూవీలో స్మిత పాత్రను పోషిస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం కలుగుతోంది. అదే నిజమని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మన 'రంగమ్మత్'త కోలీవుడ్ ప్రేక్షకుల్నీ రంజింప జేయడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్‌తో ఎటు తిరిగీ మన ముందుకు కూడా వస్తారు. ఆమె సిల్క్ స్మిత పాత్రను చేయడం నిజమే అయితే ప్రేక్షకులకు కన్నుల పండగే!
.jpg)
![]() |
![]() |