![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీని ఆద్యంతం ఎంజాయ్ చేశానని లేటెస్ట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు ప్రభాస్. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఎపిక్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇటీవల ఈ సినిమాని చూసిన ప్రభాస్.. దాన్ని గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌గా అభివర్ణించాడు. 'ఆర్ఆర్ఆర్' భారీ విజయం సాధించడంపై తారక్, చరణ్‌లను అతను అభినందించాడు.
రాజమౌళి తీసిన ఈ మూవీ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్లకు పైగా వసూలు చేసింది. "నేను 'ఆర్ఆర్ఆర్'ను చూశాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. దేశంలోని బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 1100 కోట్లకు చేరువవుతోంది. ఆ సినిమా చూడ్డం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. కనీసం 10 సీన్లలో నా కళ్లలోంచి నీళ్లొచ్చాయి. నాకు బాగా నచ్చిన సీన్లు 50 దాకా ఉంటాయి. ఇట్ వాజ్ జస్ట్ టూ గుడ్" అని చెప్పాడు ప్రభాస్.
విడుదలైన 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికీ ప్రేక్షకాదరణను పొందుతోంది. అన్ని సెంటర్లలోనూ ఈ మూవీ ప్రాఫిట్స్ సాధించింది. తెలుగువారైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను తీసుకొని రూపొందించిన ఈ కల్పిత కథా చిత్రంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటించారు. విజయేంద్రప్రసాద్ కథ రాయగా, బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.
![]() |
![]() |