![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తోన్న ప్రభంజనం దేశంలోని యావత్ చిత్రసీమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. గొప్ప ప్రశంసల రివ్యూలతో ఓపెన్ అయిన ఈ యాక్షన్ డ్రామా థియేటర్లలో వీర విజృంభణను కొనసాగిస్తోంది. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 165 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా రెండూ రోజూ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ అత్యధిక థియేటర్లలో హౌస్‌ఫుల్స్ అయ్యింది.
కరోనా కారణంగా పలుమార్లు విడుదల తేదీ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఎట్టకేలకు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదలైంది. హొంబాళే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నాలుగేళ్ల క్రితం నిర్మించగా బ్లాక్‌బస్టర్ అయిన 'కేజీఎఫ్'కు సీక్వెల్‌గా చాప్టర్ 2 వచ్చింది.
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ రెండో రోజు రూ. 44 కోట్ల నెట్ వసూలు చేసింది. బిహార్, ఉత్తరప్రదేశ్, హిందీ బెల్ట్‌లో లాంగ్ వీకెండ్ మరింత భారీ స్థాయిలో కలెక్షన్లను తీసుకురానున్నది. రెండు రోజుల్లో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 95 నుంచి 96 కోట్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
గరుడను చంపి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను చేజిక్కించుకున్న రాకీ భాయ్, ఇద్దరు బలమైన ప్రత్యర్థులను కాచుకుంటూ ఏం చేశాడనే కథతో 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎండ్ క్రెడిట్స్ ప్రకారం ఈ మూవీకి చాప్టర్ 3 కూడా వస్తుందని ఊహిస్తున్నారు. యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ ప్రధాన పాత్రధారులు కాగా.. రావు రమేశ్, ప్రకాశ్‌రాజ్, ఈశ్వరీ రావు, జాక్ కొక్కేన్, మాళవికా అవినాశ్ సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు.
![]() |
![]() |