![]() |
![]() |

తెలుగువన్ డాట్ కామ్ ఎడిటర్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బుద్ధి యజ్ఞమూర్తికి ప్రముఖ సాంస్కృతిక సంస్థ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాన్ని ప్రకటించింది. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను 2022వ సంవత్సరం కోసం ప్రకటించారు.
శృతిలయ చైర్మన్ డాక్టర్ బి. భీమ్ రెడ్డి, ఆమని, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండీ బండారు సుబ్బారావుతో కలసి అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు. ప్రముఖుల సమక్షంలో ఈ నెల 20వ తేది సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.
శృతిలయ – సీల్ వెల్ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం: శ్రీమతి ఎం.శైలజ సుమన్ , పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో
ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు
రవిచంద్ర, సీనియర్ కరెస్పాండంట్, Tv9
బుద్ధి యజ్ఞమూర్తి, ఎడిటర్, తెలుగు వన్
అంజాద్ బాబు, ఎంటర్‌టైన్ మెంట్ హెడ్, సుమన్ టీవీ
రూప వాణి కోనేరు, CVR హెల్త్ ఛానెల్ హెడ్
మురళీధర్ చామర్తి, సిటీ బ్యూరో చీఫ్, ఆంధ్రజ్యోతి
నిర్మల రెడ్డి, చీఫ్ రిపోర్టర్, సాక్షి
సుమబాల, సీనియర్ సబ్ ఎడిటర్, ఆసియా నెట్ తెలుగు న్యూస్
ఎన్. దేవి, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్, Ntv
మాధవి సిద్ధం, హెల్త్ కరెస్పాండెంట్ యాంకర్, Tv5
కె.ఎన్. హరి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్, నవ తెలంగాణ

![]() |
![]() |