![]() |
![]() |

``ఈ బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లే``.. 90ల్లో సంచలనం సృష్టించిన డైలాగ్ ఇది. `బాషా` తెలుగు వెర్షన్ కోసం `డైలాగ్ కింగ్` సాయికుమార్ చెప్పిన డబ్బింగ్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కి భలేగా వర్కవుట్ అయింది. ఆపై `పెదరాయుడు`లోనూ రజినీ పోషించిన పాపారాయుడు పాత్రకి సాయికుమార్ పలికిన సంభాషణలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే, ఆ తరువాత మాత్రం రజినీకాంత్ కి గాయకుడు మనోనే ఎక్కువగా డబ్బింగ్ చెప్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంతరం రజినీకాంత్ కి సాయికుమార్ మరోసారి డబ్బింగ్ చెప్పబోతున్నారట. అయితే.. ఈ సారి తెలుగు వెర్షన్ కోసం కాదు. ఆ వివరాల్లోకి వెళితే.. `శౌర్యం` శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా `అణ్ణాత్త` దీపావళి కానుకగా ఈ నెల 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగులో ఈ సినిమా `పెద్దన్న`గా అనువాదం కానుంది. అదే సమయంలో.. కన్నడంలోనూ ఈ చిత్రం డబ్బింగ్ రూపంలో సందడి చేయనుందని టాక్. కాగా, కన్నడ వెర్షన్ కోసం సాయికుమార్ డబ్బింగ్ చెప్పనున్నారని బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. రజినీకాంత్ - సాయికుమార్ కాంబో మరోమారు సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |