![]() |
![]() |

సర్కారు నౌకరి (sarkaaru noukari) సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆకాష్ గోపరాజు (akash goparaju) మొదటి సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ ఎవరో కాదు ప్రముఖ గాయని సునీత కొడుకు. ఆకాష్ తాజాగా తన తన తల్లి సునీత గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఆకాష్ ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న తన సర్కారు నౌకరి కి సంబంధించి జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం మా నాన్న కి కూడా ఇష్టమని చెప్పాడు. అంతే కాకుండా ఇప్పటికి మా నాన్న మా ఇంటికి వస్తుంటాడని రామ్ గారు మా నాన్న మాట్లాడుకుంటు ఉంటారని కూడా చెప్పాడు. ఇప్పుడు ఆకాష్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అలాగే చిన్నప్పటినుంచి చిరంజీవి( chiranjeevi) అంటే చాలా ఇష్టమని ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే సినిమాల్లోకి వచ్చాననే విషయాన్ని కూడా ఆకాష్ చెప్పాడు.

సింగర్ సునీత ( sunitha) రెండు సంవత్సరాల క్రితం రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్పటినుంచి వీళ్ళ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. గతంలో ఒకసారి తన రెండో పెళ్లి విషయంలో తన కొడుకు కూతురు కలిసి తనని ఒప్పించారని సునీత చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
![]() |
![]() |