![]() |
![]() |

క్యాచీ అండ్ ట్రెండీ ర్యాప్ సాంగ్స్‌తో యూత్ ఐకాన్‌గా ఫేమస్ అయిన ఎంసీ టాడ్ ఫాడ్ అలియాస్ ధర్మేశ్ కుమార్ కేవలం 24 ఏళ్ల వయసులో సోమవారం మృతి చెందాడు. అతను హిప్-హాప్ గ్రూప్ స్వదేశీ, మేనేజ్‌మెంట్ కంపెనీ 4/4 ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పనిచేస్తూ వచ్చాడు. అతని మృతికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అతను పాడిన 'ది వర్లీ రివోల్ట్' సాంగ్ విపరీతంగా పాపులర్ అయ్యింది.
2019లో టాడ్ ఫాడ్, స్వదేశీ, ఇతర ఇండియన్ హిప్-హాప్ ఆర్టిస్టుల్ని తన 'గల్లీ బాయ్' మూవీలో భాగం కావాల్సిందిగా డైరెక్టర్ జోయా అఖ్తర్ ఆహ్వానించింది. ఫేమస్ అయిన 'గల్లీ బాయ్' సాంగ్స్‌లో టాడ్ ఫాడ్ రాసిన 'ఇండియా 91' సాంగ్ కూడా ఉంది. గల్లీ బాయ్ హీరో రణవీర్ సింగ్‌తో పాటు ఆ మూవీలో ఓ కీలక పాత్ర చేసిన సిద్ధార్థ్ చతుర్వేది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా టాడ్ ఫాడ్ ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతితో పాటు సంతాపాన్నీ వ్యక్తం చేశారు.
ర్యాపర్ ధర్మేశ్ కుమార్ మృతికి అసలు కారణాన్ని కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
![]() |
![]() |