![]() |
![]() |

`వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`.. ఇలా రి-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో.. ఆయన తదుపరి చిత్రం `హరిహర వీరమల్లు`పై ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. అతి త్వరలో మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే, `హరిహర వీరమల్లు` విడుదల తేదిపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. విజయదశమి కానుకగా సెప్టెంబర్ చివరి వారంలో ఈ పిరియడ్ డ్రామాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే సెప్టెంబర్ 30ని మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటిస్తున్న `రావణాసుర`కి రిలీజ్ డేట్ గా లాక్ చేశారు. మరి.. అదే తేదికి `హరిహర వీరమల్లు` వస్తుందా? లేదంటే వేరే తేదికి వస్తుందా? అన్నది చూడాలి.
కాగా, `హరిహర వీరమల్లు`ని వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించనుండగా.. అతనికి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ సందడి చేయనుంది. స్వరవాణి కీరవాణి ఈ మూవీకి బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |