![]() |
![]() |

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటిదాకా రెండు సాంగ్స్ విడుదల కాగా మొదటి సాంగ్ 'కళావతి' యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో తక్కువ టైములో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సింగిల్ గా రికార్డు క్రియేట్ చేసింది.
తమన్ స్వరపరిచిన మెలోడీ సాంగ్ 'కళావతి' విడుదలైన రోజు నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తమన్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వాయిస్ తో పాటు మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ మ్యూజిక్ వీడియోకి రికార్డు వ్యూస్ వస్తున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ తాజాగా 100 మిలియన్ మార్క్ దాటింది. టాలీవుడ్ లో తక్కువ టైములో 100 మిలియన్ మార్క్ దాటిన సాంగ్ గా 'కళావతి' రికార్డు నెలకొల్పింది.

రీసెంట్ గా 'సర్కారు వారి పాట' నుంచి విడుదలైన 'పెన్నీ' సాంగ్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు మహేష్.
![]() |
![]() |