![]() |
![]() |

'అలా ఎలా' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్.. 'కుమార్ 21 ఎఫ్' సినిమాతో కుర్రకారుని మాయ చేసింది. ఆ తర్వాత ఒకట్రెండు హిట్స్ అందుకున్నప్పటికీ హీరోయిన్ గా కంటే ఎక్కువగా స్పెషల్ రోల్స్ లోనే మెరిసింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో లీడ్ రోల్ లో నటిస్తూ బిజీగా ఉన్న హెబ్బా.. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. తాను ఇంత అందంగా మారడానికి సర్జరీలే కారణమంటూ పరోక్షంగా చెప్పింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించగా.. ఓ నెటిజన్ 'మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?' అని అడిగాడు. దీనిపై స్పందించిన హెబ్బా 'అదొక పెద్ద సీక్రెట్.. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు' అంటూనే అసలు సీక్రెట్ బయటపెట్టేసింది. 'నా అందం దేవుడు కొంత ఇచ్చింది.. మిగతాది డాక్టర్ల కృషి' అంటూ హెబ్బా చెప్పుకొచ్చింది. సర్జరీల వలనే తాను ఇంత అందంగా ఉన్నానని చెప్పకనే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హెబ్బా చేతిలో ప్రస్తుతం 'గీత', 'ఓదెల రైల్వేస్టేషన్', ,తెలిసినవాళ్ళు' సినిమాలు ఉన్నాయి. గీత మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో హెబ్బా మూగ యువతిగా కనిపించనుంది. 'ఓదెల రైల్వేస్టేషన్', ,తెలిసినవాళ్ళు' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
![]() |
![]() |