![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `ధృవ` (2016) ఒకటి. తమిళ సినిమా `తని ఒరువన్` (2015) ఆధారంగా తెరకెక్కిన ఈ కాప్ డ్రామాకి మాజీ కథానాయకుడు అరవింద్ స్వామి విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత చరణ్, అరవింద్ మరోమరు జట్టుకట్టనున్నారని సమాచారం.
Also Read: పవన్ సినిమాలో కృతి.. ఈ సారి సాయితేజ్ జోడీ!?
ఆ వివరాల్లోకి వెళితే.. సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రామ్ చరణ్ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అరవింద్ స్వామి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. `ధృవ` తరువాత చరణ్ ని స్వామి మరోసారి ఢీ కొట్టబోతున్నట్లే. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబో మూవీలో అరవింద్ స్వామి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |