![]() |
![]() |

ఒకవైపు కొత్త దర్శకులతో జట్టుకడుతూనే.. మరోవైపు స్టార్ కెప్టెన్స్ తోనూ ముందుకు సాగుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. రీసెంట్ గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `లైగర్` పూర్తిచేసిన విజయ్.. త్వరలో అదే పూరితో `జన గణ మన` చేయబోతున్నాడు. అలాగే బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. `పుష్ప - ద రూల్` రిలీజయ్యాక విజయ్ - సుక్కు కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు.
Also Read: భారతీయులంతా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడాలి
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ తీస్తున్న మూవీ తరువాత విజయ్ దేవరకొండ కాంబో వెంచర్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు. త్వరలోనే విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. విజయ్ - త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |