![]() |
![]() |

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ - ఇండియా మూవీ `రాధేశ్యామ్`తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జంటగా `ఆచార్య` (ఇందులో మెగాస్టార్ చిరంజీవిది టైటిల్ రోల్)లోనూ, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన తమిళ చిత్రం `బీస్ట్`లోనూ ఈ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ కి జతగా `భాయ్ జాన్`లోనూ, రణ్ వీర్ సింగ్ కి జోడీగా `సర్కస్`లోనూ మిస్ హెగ్డే నాయికగా సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కథానాయకుడిగా `తొలిప్రేమ` ఫేమ్ వెంకి అట్లూరి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో ధనుష్ కి జంటగా పూజా హెగ్డే నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ధనుష్ కి జోడీగా ఫస్ట్ టైమ్ దర్శనమివ్వనున్న పూజా హెగ్డే.. సదరు చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |