![]() |
![]() |

'జీవితం ఎవర్నీ వదిలి పెట్టదు.. అందరి సరదా తీర్చేస్తది...' అంటూ సినిమాలలో హీరోల చేత డైలాగ్స్ చెప్పించే పూరి జగన్నాథ్.. రియల్ లైఫ్ లోనూ జీవితం గురించి అంతే పవర్ ఫుల్ గా మాటలు చెప్తుంటారు. పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులోని మాటలను బయట పెట్టే పూరి.. తాజాగా విడాకుల అంశంపై తనదైన శైలిలో స్పందించారు.
ఈ కరోనా దయవల్ల రాత్రీపగలు అనే తేడా లేకుండా నెలల తరబడి భార్యాభర్తలు కలిసి ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ ఒక్క ఏడాదిలో ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ విడాకులు నమోదయ్యాయని పూరి అన్నారు. విడాకులకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని.. అందులో మొదటిది 'ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఆశించడం', రెండోది 'స్వేచ్ఛ' అని చెప్పారు. నిజానికి భార్యాభర్తలు ఒకరితో ఒకరు అరగంట మించి మాట్లాడుకోలేరని.. సో మగవాళ్ళు వీలైనంత వరకూ తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ.. టీవీ, మొబైల్ చూస్తూ టైమ్ పాస్ చేయాలని.. అప్పుడే ఈ పాండమిక్ రోజులలో వివాహ బంధాన్ని భద్రంగా ఉంచుకోగలమని సలహా ఇచ్చారు.
పెళ్ళికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరమని, కనీసం రెండేళ్ల పాటు అబ్బాయి, అమ్మాయి మధ్య ఓ అవగాహన ఏర్పడిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలని పూరి చెబుతున్నారు. విడాకుల కోసం మనం కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నామో.. పెళ్లి కోసం కూడా కోర్టుల చుట్టూ తిరిగి, కౌన్సెలింగ్‌లు అన్నీ అయ్యాకే వివాహం చేసుకొనే రూల్ రావాలని అన్నారు. అప్పుడు నిజంగా పెళ్లి కావాలని కోరుకునేవాళ్లే మిగులుతారని, దానంతటదే ఈ విడాకుల గోల తగ్గిపోతుందని పూరి చెప్పుకొచ్చారు.
![]() |
![]() |