![]() |
![]() |

`బాహుబలి` సిరీస్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే.. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అన్నట్లుగా తయారైంది. విడుదలకు సిద్ధమైన `రాధేశ్యామ్`తో పాటు చిత్రీకరణ దశలో ఉన్న `సలార్`, `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ కూడా అదే బాట పడుతున్నాయి. వీటిలో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ అయితే దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ కెప్టెన్ సిద్ధార్థ్ ఆనంద్ తోనూ ప్రభాస్ ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2022 చివరలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్.. `రా ఏజెంట్`గా కనిపించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి.. రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనున్నట్లు హిందీ చిత్ర వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
మరి.. ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రభాస్, సిద్ధార్థ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
కాగా, సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో `పఠాన్` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
![]() |
![]() |