![]() |
![]() |
.jpg)
పద్దెనిమిదేళ్ళకు పైగా వెండితెరపై వెలుగులు పంచుతోంది అందాల తార ప్రియమణి. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా.. అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనూ అలరిస్తోంది. తమిళ చిత్రం `పరుత్తివీరన్`తో `ఉత్తమ నటి`గా జాతీయ పురస్కారం సైతం అందుకుంది. అంతేకాదు.. పెళ్ళయ్యాక కూడా నటనని కొనసాగిస్తూ.. ప్రేక్షకుల ఆదరణ పొందుతోందీ టాలెంటెడ్ యాక్ట్రస్. మరీ ముఖ్యంగా.. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ - సిరీస్ తో మరోసారి నటిగా తనదైన సత్తా చాటింది ప్రియమణి. ఇందులో టైటిల్ రోల్ పోషించిన మనోజ్ బాజ్ పాయ్ కి శ్రీమతిగా, ఇద్దరు బిడ్డల తల్లిగా ప్రియమణి ఎంతో సహజంగా నటించింది. సుచిత్రా అయ్యర్ తివారీ పాత్రలో ఒదిగిపోయింది.
కాగా, `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`లోనూ ప్రియమణి దర్శనమివ్వనుంది. సుచిత్ర పాత్రలో కొనసాగి.. మరోసారి మెస్మరైజ్ చేయనుంది. జూన్ 4 నుంచి అంటే రేపటి నుంచి రెండో సీజన్.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జూన్ 4 ప్రియమణి బర్త్ డే. మరి.. తన పుట్టినరోజు నుంచి స్ట్రీమ్ కాబోతున్న ఈ సిరీస్ తోనూ ప్రియమణి నటిగా మరింత గుర్తింపు పొందుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన `నారప్ప`, `విరాటపర్వం` చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
![]() |
![]() |