![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 31` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రొడ్యూస్ చేయనుంది. వచ్చే ఏడాది ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ ని ఎంపిక చేశారట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ తొలి చిత్రం `ఉగ్రమ్` (2014), రెండో చిత్రం `కేజీఎఫ్ ఛాప్టర్ 1` (2018)తో పాటు విడుదలకు సిద్ధమైన `కేజీఎఫ్ ఛాప్టర్ 2`, చిత్రీకరణ దశలో ఉన్న `సలార్`కి కూడా రవి బస్రూర్ నే స్వరకర్త. ఈ క్రమంలోనే.. తను డైరెక్ట్ చేయనున్న ఐదో సినిమా `ఎన్టీఆర్ 31`కి కూడా రవినే మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగించనున్నారట నీల్. అదే గనుక నిజమైతే.. తారక్ తో రవి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `ఎన్టీఆర్ 31`లో రవి బస్రూర్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
మరి.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేసిన గత రెండు సినిమాలతోనూ ఘనవిజయాలతో పాటు అవార్డులను సైతం అందుకున్న రవి బస్రూర్.. రాబోయే చిత్రాలతోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |