![]() |
![]() |

మహేశ్ ఎంతటి సూపర్‌స్టార్ అయినా, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. సింగిల్‌గా పార్టీలకూ, షికార్లకూ అసలు వెళ్లడు. సరదాగా ఎక్కడికి వెళ్లినా అది ఫ్యామిలీతోటే. ముంబైకు చెందిన నమ్రతను ప్రేమించి పెళ్లిచేసుకున్న మహేశ్‌కు పిల్లలంటే మరీ ప్రేమ. వారితో కలిసి ఆడే ఆటలు, చేసే చిలిపి చేష్టలు, స్విమ్మింగ్‌పూల్‌లో ఈతలు వంటి ఎన్నో మూమెంట్స్‌ను ఆయన కానీ, భార్య నమ్రత కానీ తరచూ షేర్ చేస్తూనే ఉంటారు.
లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నమ్రత షేర్ చేసిన పిక్చర్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పిక్చర్‌లో మహేశ్ చైర్‌లో కూర్చొని కళ్లు మూసుకొని ఉంటే, ఆయన ఒడిలో తెల్లటి బట్టకప్పుకొని మునగదీసుకొని పడుకొని నిద్రపోతూ ఉంది సితార. చూడగానే ఆ ఫొటో ముద్దొస్తూ ఉంది. దానికి, "పొద్దున్నే ఇలా ముడుచుకొని కావలించుకొని పడుకోవాల్సిందే!! మరో రకంగా మేం నిద్రలేవం.." అనే క్యాప్షన్‌తో పాటు రెండు హార్ట్ ఎమోజీలను జోడించారు నమ్రత. #wakeupmantra #babyinarms #love అనే హ్యాష్‌ట్యాగ్స్ కూడా పెట్టారు.
కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ పోస్ట్‌కు 1.3 లక్షల లైక్స్ రావడం విశేషం. మహేశ్ ఫ్యాన్స్ అయితే ఈ ఫొటోను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మహమ్మారి కారణంగా షూటింగ్ లేకపోవడంతో ఇంట్లోనే సమయాన్నంతా గడుపుతున్నాడు మహేశ్. ప్రస్తుతం ఆయన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్.
![]() |
![]() |